హైదరాబాద్, వెలుగు: మాంగళ్య షాపింగ్ మాల్ తమ 33 వ బ్రాంచ్‌ను కోదాడలో (సూర్యాపేట జిల్లా) బుధవారం ప్రారంభించింది. సినీ నటి ఆషికా రంగనాథ్, ఎమ్మెల్యే నాలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకట రత్నం బాబు ముఖ్య అతిథులుగా హాజరై మాల్‌ను ప్రారంభించారు.
సంస్థ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, పుల్లూరు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకే అందించడమే తమ సక్సెస్ సీక్రెట్ అని తెలిపారు. రూ. 99 నుంచి రూ. 1 లక్ష వరకు అన్ని వర్గాలకు, వివాహ శుభకార్యాలకు సరిపడే వెడ్డింగ్ కలెక్షన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఈ కొత్త షాపింగ్ మాల్ అందుబాటులోకి రావడంతో కోదాడ ప్రజలు పెళ్లిళ్ల షాపింగ్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తీరిందని అన్నారు.
భవిష్యత్తులో మరో 10 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన ఈ సంస్థ, తమిళనాడులో కూడా బ్రాంచులను ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
