తెలుగు బిగ్ బాస్ 8 సీజన్ రోజురోజుకీ ఆసక్తిగా మారుతోంది. ఎలిమినేషన్లు దగ్గరపడేకొద్దీ గేమ్ సమీకరణాలు మారిపోతున్నాయి. అయితే ఇప్పటివరకూ ఆరు వారాల్లో ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, నవీన్, సోనియా, ఆదిత్య ఓం, నైనికా మరియు కిర్రాక్ సీత ఇప్పటివరకు ఎలిమినేట్ అయ్యారు.
ఈ వారం వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన టేస్టీ తేజ అలాగే ప్రముఖ నటి హరితేజ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మరో కంటెస్టెంట్ అయిన మణికంఠ ఎలిమిననేట్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో మణికంఠ ఎప్పుడూ సింపతీతో గేమ్ అడుతుంటాడాని అలాగే ఓవర్ ఎమోషన్స్ చూపిస్తూ చిరాకు తెప్పిస్తుంటాడని అందుకే ఈ వారం మణికంఠ ఎలిమినేట్ కాబోతున్నట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read :- తెలుగులో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కన్నడ హీరో..
ఈ విషయం ఇలా ఉండగా మణికంఠ బిగ్ బాస్ హౌజ్ లో దాదాపుగా 7 వారాలపాటూ ఉన్నాడు. దీంతో మణికంఠ రూ.7 లక్షలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అయితే మణికంఠ బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్లలో తకువ రెమ్యునేషన్ అందుకుంటున్నాడు.