ఢిల్లీ లిక్కర్ స్కాం : 17 నెలల తర్వాత మనీష్ సిసోడియాకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాం : 17 నెలల తర్వాత మనీష్ సిసోడియాకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ డెవలప్ మెంట్. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 2024, ఆగస్ట్ 9వ తేదీ బెయిల్ పిటీషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 

మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి 17 నెలలు అయ్యింది.. ఆయన సుదీర్ఘ జైలు శిక్షను అనుభవించారని.. అయినా కూడా ఇంకా విచారణ ప్రారంభం కాలేదా అంటూ సీబీఐని ప్రశ్నించింది కోర్టు. అతని హక్కులను హరించారంటూ అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 

2023, ఫిబ్రవరి 26వ తేదీన మనీష్ సిసోడియాను కస్టడీలోకి తీసుకున్నది సీబీఐ. మార్చి 9వ తేదీ రాత్రి అరెస్ట్ చూపించారు. అప్పటి నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు ఆయన. 17 నెలల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ తో తీహార్ జైలు నుంచి బయటకు రానున్నారు. ఇదే కేసులో ప్రస్తుతం సీఎం కేజ్రీవాల్, కవతి ఇంకా తీహార్ జైలులోనే ఉన్నారు.

  • సీబీఐ, ఈడీ రెండు కేసుల్లో బెయిల్
  • పాస్ పోర్టు సరండర్ చేయాలని ఆదేశం
  • ప్రతి సోమవారం విచారణకు హాజరు కావాలని కండీషన్
  • అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశాలు