
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’. మలయాళంలో సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. యంగ్ ఫ్రెండ్స్ బ్యాచ్ తమిళనాడులోని కొడైకెనాల్‌కు డ్రీం టూర్‌కి వెళ్తారు.
వారు హిల్ స్టేషన్‌తో పాటు కమల్ హాసన్ ‘గుణ’ చిత్రీకరించబడిన డెవిల్స్ కిచెన్ అని పిలువబడే గుణ కేవ్స్‌ను ఎక్స్‌ఫ్లోర్ చేస్తారు. దురదృష్టవశాత్తు, స్నేహితుల్లో ఒకరు గుహలోని లోతైన గుంటలో పడిపోతాడు, మిగతా వారు భయాందోళనలకు గురౌతారు. తనను రక్షించడానికి మిగతా వారంతా ఏం చేశారనేది మూవీ కాన్సెప్ట్‌గా ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ చెప్పారు.