
సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’. మలయాళంలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన నిర్మాతలు వివేక్ కూచిభొట్ల , నిరంజన్ రెడ్డి, నవీన్ యెర్నేని, శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ‘మలయాళంలో 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు. ‘మంజుమ్మల్ బాయ్స్’ అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకుడు చిదంబరం అన్నాడు. తెలుగులో తమ చిత్రం గ్రాండ్‌గా విడుదలవడం హ్యాపీ అని నటీనటులు అన్నారు.