ప్రధాని పదవికి ఓ స్థాయి ఉంటది

ప్రధాని పదవికి ఓ స్థాయి ఉంటది

ప్రధాని నరేంద్రమోడీపై మాజీ పీఎం మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఆదివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రత్యేక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ప్రతి సమస్యకు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను నిందించడం సరికాదని హితవు పలికారు. ప్రధాని పదవికి ఓ స్థాయి ఉంటుందన్న మన్మోహన్.. నిజాలు దాచేందుకు, రాజకీయ లబ్ది కోసం.. కాంగ్రెస్ ఎన్నడూ జాతిని విభజించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఒకవైపు ప్రజలు ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో బాధపడుతుంటే ఏడున్నర ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోకుండా అన్నింటికీ నెహ్రూను బాధ్యుల్ని చేయడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు. 

"నా దృష్టిలో ప్రధాని పదవికి ఓ ప్రత్యేక స్థాయి ఉంది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చరిత్రను నిందించకుండా ప్రధాని తన హుందాతనాన్ని కాపాడుకోవాలి. పదేళ్లు ప్రధానిగా ఉన్న సమయంలో నా చేతల ద్వారానే మాట్లాడాను. ప్రపంచం ముందు దేశ ప్రతిష్ట దిగజారేలా ఎన్నడూ వ్యవహరించలేదు." బలహీన, మౌన, అవినీతి ప్రధాని అని తప్పుడు ప్రచారాలు చేసిన బీజేపీ దాని బీ, సీ టీంల అసలు రంగు దేశ ప్రజల ముందు బయటపడిందని మన్మోహన్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎవడెట్లపోయినా.. మీరు మాత్రం సల్లగుండాలె

మంత్రి హరీష్రావుకు రఘునందన్ సవాల్