
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు విమర్శలకు దిగారు. గురువారం కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రోజుకో రైతు చస్తున్నా, వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకం మిగిలిస్తున్నా, పంటనష్టపోయి అప్పులపాలవుతున్నా, జనాలు అరిగోసల పాలవుతున్నా.. దొరగారూ పుట్టిన రోజు వేడుకలు చేసుకోండి అని షర్మిల విమర్శించారు. కేసీఆర్ రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలె.. ఎవడెట్లపోయినా ఆయన మాత్రం సల్లంగుండాలె అని దుయ్యబట్టారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా జన్మదిన సెలబ్రేషన్స్ చేసుకోండి అని కామెంట్ చేశారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకొంటూ, అంబేడ్కర్ రాజ్యాంగం గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్త రాజ్యాంగం రాయాలనుకునే దొర గారూ పుట్టినరోజు వేడుకలు చేసుకోండి అని షర్మిల ట్వీట్ చేశారు.
ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, ఉద్యోగాలకోసం చస్తున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా, అప్పుల కుప్పలను గొప్పలుగా చెప్పుకుంటూ,దేశరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకొంటూ,అంబేడ్కర్ రాజ్యాంగం గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్తరాజ్యాంగం రాయాలనుకునే దొరగారూ, మీరు పుట్టినరోజు వేడుకలు చేసుకోండి1/2
— YS Sharmila (@realyssharmila) February 17, 2022
మరిన్ని వార్తల కోసం: