రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు శంకుస్థాపన

రూ.100 కోట్లతో ఐటీ టవర్స్కు శంకుస్థాపన

మేడ్చల్: రాష్ట్రంలో మరో ఐటీ పార్కు నిర్మాణం కానుంది. రూ.100 కోట్ల వ్యయంతో మేడ్చల్ లోని కండ్లకొయ్యలో నిర్మించనున్న ఈ ఐటీ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఐటీ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈస్థాయికి ఎదిగారన్నారు. ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలన్నారు. తెలంగాణకు కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని చెప్పారు. ఐటీ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కరోనాతో కొంత ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

కాగా, కండ్లకొయ్యలో నిర్మించనున్న ఐటీ పార్క్ ద్వారా రాష్ట్రంలో కొత్తగా 50 వేల ఉద్యోగాలు సృష్టించే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. తెలంగాణ గేట్ వే అనే పేరుతో ఈ ఐటీ పార్క్ ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఈ పార్క్ నిర్మాణం కానుంది. దాదాపు 10 ఎకరాల్లో చేపట్టనున్న ఈ ఐటీ పార్క్ కోసం ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ భూమిని కేటాయించింది. 

మరిన్ని వార్తల కోసం:

ప్రముఖ కమెడియన్ ప్రదీప్ మృతి

లీక్ చేస్తే కఠిన చర్యలు

మైనస్ డిగ్రీల టెంపరేచర్లో జవాన్ల పెట్రోలింగ్