రాజ్యసభలో ఈ ఏడాది 68 మంది రిటైర్మెంట్‌

రాజ్యసభలో ఈ ఏడాది 68 మంది రిటైర్మెంట్‌

తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా అరవై ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఈ ఏడాది తమ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుంది.  68 ఖాళీలలో ఇప్పటికే ఢిల్లీలోని మూడు స్థానాలకు ఎన్నికలకు నిర్వహణకు నోటిషికేషన్‌ జారీ అయ్యింది. ఆప్ నేతలు సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తాల పదవీకాలం  జనవరి 27న పూర్తి కానుంది.  

ఇక సిక్కింలోని  ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు త్వరలో జరగనుంది.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాదవ్య, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 57 మంది నేతల పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తవుతుంది.

తెలంగాణ విషయానికి వచ్చేసరికి  బీఆర్ఎస్ తరుపున జోగినిపల్లి సంతోష్ కుమార్, రవిచంద్ర వద్దిరాజు, బి లింగయ్య యాదవ్ పదవీ విరమణ చేయనున్నారు.  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కనీసం ఇద్దరిని  రాజ్యసభకు పంపాలని ఆశిస్తోంది. ఇక ఏపీ చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌, వైఎస్సార్‌సీపీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర 6, బీహార్‌ 6, మధ్యప్రదేశ్‌ 5, పశ్చిమ బెంగాల్‌ 5,  కర్ణాటక 4, గుజరాత్ 4, ఒడిశా 3, తెలంగాణ 3, కేరళ 3,  ఆంధ్ర ప్రదేశ్ 3, జార్ఖండ్ 2, రాజస్థాన్‌ 2,  ఉత్తరాఖండ్ 1, హిమాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, ఛత్తీస్‌గఢ్ 1 స్థానం చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు జూలైలో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో పదవీ విరమణ చేయనున్నారు.