Action Thriller Movie: ఓటీటీలో భయ్యాజీ మంట పుట్టిస్తున్నాడు..ఈ యాక్షన్ థ్రిల్లర్ డోంట్ మిస్ భయ్యా

Action Thriller Movie: ఓటీటీలో భయ్యాజీ మంట పుట్టిస్తున్నాడు..ఈ యాక్షన్ థ్రిల్లర్ డోంట్ మిస్ భయ్యా

బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ బాజ్‌‌పేయి, సువీందర్ విక్కీ, జతిన్ గోస్వామి, విపిన్ శర్మ, జోయా హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భయ్యాజీ(Bhaiyya Ji). ఈ మూవీ మే 24న థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జులై 27 న ఓటీటీలో రిలీజ్ కాగా..కొన్ని రోజుల్లోనే 200 మిలియన్ల వాచ్ మినట్స్ తో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఈ సందర్బంగా జీ5 ఓటీటీ ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. భయ్యాజీ మంట పుట్టిస్తున్నాడంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా ఓటీటీకి వచ్చిన మూడు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. ఇది మనోజ్ భయ్యాజీ 100వ సినిమా కావడం విశేషం. 

 భయ్యాజీ కథేంటంటే::

రామ్ చరణ్ (మనోజ్ బాజ్‌‌పేయి) తమ్ముడు వేదాంత్‌‌ ఊరికి దూరంగా సిటీలో చదువుకుంటుంటాడు. ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన గొడవల్లో అభిమన్యు (జతిన్ గోస్వామి) అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. అభిమన్యు తండ్రి చంద్రభాన్ సింగ్ (సువీందర్ విక్కీ) పెద్ద రాజకీయ నాయకుడు. ఆ హత్య అభిమన్యు చేయలేదని నమ్మిస్తాడు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ చాలా బాధపడతాడు.

రామ్ చరణ్ బిహార్‌‌లో ఒక పెళ్లి తంతులో ఉన్నప్పుడు అతని తమ్ముడి హత్య విషయం తెలుస్తుంది.  ఆ దుఃఖంలో రామ్ చరణ్ మధ్యతరగతి మనిషిలా అనిపిస్తాడు. కానీ.. తమ్ముడి  అంత్యక్రియలు పూర్తయ్యాక అసలు విషయం తెలుస్తుంది. రామ్‌‌చరణ్‌‌ మరో పేరు భయ్యాజీ. లోకల్‌‌గా పెద్ద గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌. కానీ.. కొన్ని కారణాల వల్ల రౌడీయిజాన్ని వదిలేసి బతుకుతుంటాడు. తమ్ముడి చావుతో అతనిలోని భయ్యాజీ నిద్ర లేస్తాడు. తన తమ్ముడి చావుకి కారణమైన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు పాత భయ్యాజీగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అభిమన్యుని భయ్యాజీ చంపాడా? లేదా? అనేది స్క్రీన్‌‌ మీద చూసి తెలుసుకోవాలి.