
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. చిన్న,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కొత్త లోకంలో విహరింపజేసిన అవతార్ సినిమా సీక్వెల్స్‌తో మరోమారు ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచం చూపించారు. జేమ్స్ కామెరూన్ (James Cameron) అద్భుత సృష్టి అవతార్(Avatar). పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు దర్శకుడు కామెరూన్.
తాజాగా అవతార్ మూడో భాగంపై అప్‌డేట్ వచ్చేసింది. ‘అవతార్- ఫైర్ అండ్ యాష్’ (Avatar 3) టైటిల్‌ను ప్రకటించడంతో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి రెడీగా ఉండండని అంటూ మేకర్స్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వచ్చే ఏడాది 2025 డిసెంబర్ 19న అవతార్ 3 రిలీజ్ కానున్నట్లు తెలిపారు.
Just announced at #D23, our title for the next Avatar film:
— Avatar (@officialavatar) August 10, 2024
Avatar: Fire and Ash. Get ready to journey back to Pandora, in theaters December 19, 2025. pic.twitter.com/gZkCCsTl9x
ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ప్రాంఛైజ్ లో రెండు భాగాలు ఇప్పటికే వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యాయి. 13 ఏళ్ల క్రితం ఈ మూవీ సాధించిన హిట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.లాస్ట్ ఇయర్ 2022 లో ఈ మూవీకి సీక్వెల్గా అవతార్ 2 సినిమా వచ్చి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అవతార్ 2–ది వే ఆఫ్ వాటర్ అంటూ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేసింది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 52 వేల స్క్రీన్ లలో 160 భాషల్లో రిలీజై..రికార్డులు కొల్లగొట్టింది.
లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కామెరూన్..అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా రాబోతోన్న మూడో భాగాన్నికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈసారి పాత్రలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాము. ఈ మూడో భాగంతో మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు అందించేందుకు మేకర్స్ కష్టపడుతున్నట్లు వివరించారు.
అంతేకాకుండా, అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’లో కనిపించిన కేట్ విన్స్‌లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో కూడా మరింత పొడిగించాము. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుంది’ అంటూ కామెరూన్ తెలిపారు.అలాగే అవతార్ ఫ్రాంచైజీ (Avatar franchise) లో రానున్న అవతార్ 4 2029లో, చివరిగా రానున్న అవతార్ 5 డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించారు.
ఇక అవతార్ 3 టీజర్ న్యూస్తో..అవతార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. టీజర్ రాక కోసం వెయిటింగ్ సర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.ఫస్ట్ పార్ట్లో పండోరా అందాలను అద్భుతంగా చూపించిన జేమ్స్ కామెరూన్..పార్ట్ 2లో సముద్రపు అడుగు భాగాన్ని అంతకుమించిన అందాలతోనే తెరకెక్కించాడు. ఇక మూడో భాగం కూడా ఎలాంటి అనుభవాన్ని పంచుతుందో అని ఆడియన్స్ ఎదురుచుస్తూన్నారు.