Narrow Escape: తృటిలో తప్పించుకున్నాడు.. లేకుంటే పులికి ఆహారం అయ్యేవాడు..

Narrow Escape: తృటిలో తప్పించుకున్నాడు.. లేకుంటే పులికి ఆహారం అయ్యేవాడు..

భూమ్మీద నూకలున్నాయంటే ఇదేనేమో..ఓ వ్యక్తి చిరుత పులి దాడినుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతని అదృష్టం బాగుండి.. బైక్ లైట్ ఫోకస్ కళ్లకు కొట్టడంతో చిరుత పారిపోయిందిగానీ.. లేకుంటే దానికి అతను ఆహారం అయ్యేవాడు. వ్యక్తి రావడానికి కొన్ని సెకన్ల ముందు చిరుత పులి దారి దాటింది. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలేంటో చూద్దాం రండి.. 

అది ఉత్తరప్రదేశ్ లోని కంకేర్ ఖేరా ప్రాంతం. ఈ ప్రాంతంలోని నివాస గృహాలు అటవి ప్రాంతానికి ఆనుకొని ఉన్నాయి. శుక్రవారం (మార్చి 1)  తెల్లవారు జామున అదే ప్రాంతానికి చెందిన అక్షయ్ ఠాకూర్ అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు. సడెన్ గా చిరుత పులి అతని బైక్ కి అడ్డంగా వచ్చింది. అతనిపై దాడి చేసినం పనిచేసింది. కొన్ని సెకన్లు ముందు బైక్ వచ్చి ఉంటే ఆ వ్యక్తిపై చిరుతకి బలయ్యేవాడు. సడెన్ గా బ్రేక్ వేసి లైట్స్ ఫోకస్ పెట్టడంతో ఏమీ కనిపించకపోవడంతో చిరుత పారిపోయింది. 

ఈ ఘటనపై అక్షయ్ ఠాకూర్ కాలనీ కార్యదర్శికి తెలియజేయడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునొ ఆ ప్రాంతంలో చిరుత పులి సంచారాన్ని గమనించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ని  పరిశీలించారు. 
ఈ విషయం తెలిసిన కాలనీ వసులు తమ భద్రత, పాఠశాలకు వెళ్లే  వారి పిల్లల భద్రత గురించి ఆందోళన చెందారు.సమీప పొలాల్లో చిరుత పులి దాగి ఉన్నట్లు గుర్తించారు అటవీ శాఖ అధికారులు. కాలనీ భయపడొద్దని.. త్వరలో పులిని పట్టుకుంటామని వారికి అటవీ శాఖా అధికారులు హామీ ఇచ్చారు.