న్యూఢిల్లీ: ఇండియా మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో పుంజుకుంది. అమెరికా టారిఫ్ అనిశ్చితులతో గ్లోబల్‌గా డిమాండ్ పడిపోయినా, దేశీయంగా డిమాండ్ బలంగా ఉంది. తయారీ కంపెనీల కొత్త ఆర్డర్లు పెరగడంతో పాటు ప్రొడక్షన్ నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది.
హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జనవరిలో 55.4 గా నమోదవ్వగా ఫిబ్రవరిలో 56.9కి పెరిగింది. ‘‘దేశీయ ఆర్డర్లు అక్టోబర్ తర్వాత అత్యధిక స్థాయికి చేరగా, ఉత్పత్తి నాలుగు నెలలలో వేగంగా పెరిగింది. ఇన్‌పుట్ ఖర్చులు స్థిరంగా ఉన్నప్పటికీ, తయారీదారులు అమ్మకపు ధరలను పెంచారు’’అని హెచ్‌ఎస్‌బీసీ తెలిపింది.
