మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచర్ ఉద్యోగాలు..

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో టీచర్ ఉద్యోగాలు..

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(ఎంఏఎన్​యూయూ) టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 29. 

పోస్టుల సంఖ్య: 13.
పోస్టులు: అసోసియేట్ ప్రొఫెసర్– ఎడ్యుకేషన్  01, ప్రొఫెసర్ 05, అసోసియేట్ ప్రొఫెసర్ 05, హెడ్ ఆఫ్​ ది డిపార్ట్​మెంట్ 01, ప్రొఫెసర్(డైరెక్టర్) 01. 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఏ, ఎం.ఎడ్, ఎంఎస్సీ, ఎంఫిల్/ పీహెచ్​డీ, ఎంఎస్/ ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 65 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 04.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29.
అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.500. 
పూర్తి వివరాలకు manuu.edu.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.