సికింద్రాబాద్ చింతబావి బస్తీలో కలుషిత నీరు సరఫరా.. 100 మందికి అస్వస్థత

సికింద్రాబాద్ చింతబావి బస్తీలో కలుషిత నీరు సరఫరా.. 100 మందికి అస్వస్థత

హైదరాబాద్ : సికింద్రాబాద్ మెట్టుగూడ డివిజన్ లోని చింతబావి బస్తీలో కలుషిత నీరు తాగి దాదాపు 250 మంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మంచినీటి పైపులైన్స్ లో డ్రైనేజీ వాటర్ కలవడం వల్ల కలుషిత నీరు సరాఫరా అయ్యిందని, దిక్కులేని పరిస్థితుల్లో ఆ నీటినే తాగడం వల్ల తామంతా అస్వస్థతకు గురయ్యామని బస్తీవాసులు కొందరు ఆరోపిస్తున్నారు. ః

విషయం తెలియగానే స్థానిక ప్రజాప్రతినిధులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బస్తీవాసులకు వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచి నీళ్లను అందిస్తున్నట్లు సమాచారం.

చింతబావి బస్తీలో దాదాపు 1700 ఇండ్లు ఉంటాయి. సుమారు 250 మంది కలుషిత నీళ్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీళ్లపై స్థానిక కార్పొరేటర్ ను ప్రజలు నిలదీశారు. కలుషిత నీళ్లపై వాటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. డ్రైనేజీ నీళ్లు తాగునీటిలో కలవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.