జూన్ 24న పలు రైళ్లు రద్దు

జూన్ 24న పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు : ఒడిశాలోని బహనాగా బజార్​స్టేషన్​పరిధిలో జరుగుతున్న  రైల్వే ట్రాక్ రిపేర్ పనుల కారణంగా శనివారం(జూన్ 24) పలు రైళ్లను రద్దుచేశారు. షాలీమార్ – హైదరాబాద్, -షాలీమార్ – హౌరా, -తిరుపతి–హౌరా, హౌరా– ఎర్నాకులం, మంగుళూరు సెంట్రల్​– సంత్రాగచ్చి స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్​ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి.  మైసూరు– హౌరా,  ఎంజీఆర్​చెన్సై సెంట్రల్​– సంత్రా గచ్చి స్టేషన్ల మధ్య ఎక్స్​ప్రెస్ రైళ్లను ఈ నెల 25 వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా.. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య పరిధిలో వివిధ స్టేషన్ల మధ్య నడుస్తున్న స్పెషల్​ రైళ్ల గడువును అధికారులు పొడిగించారు.

ఎల్టీటీ ముంబై– షోలాపూర్​మధ్య నడిచే స్పెషల్ ట్రైన్​ను జులై 5 నుంచి 26 వరకు, షోలాపూర్​– తిరుపతి​మధ్య నడిచే స్పెషల్​రైలును జులై 6 నుంచి 27 వరకు, తిరుపతి – షోలాపూర్, పుణె– అమరావతి స్పెషల్​ రైలును జులై 7 నుంచి 30 వరకు, అమరావతి–పుణె  మధ్య నడిచే స్పెషల్​రైలును జులై 8 నుంచి 31 వరకు అధికారులు పొడిగించారు.