ఏప్రిల్ 23 వరకు పలు రైళ్లు రద్దు

ఏప్రిల్ 23 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు: తిరుపతి రూట్ లో నడుస్తున్న పలు రైళ్లను ఈ నెల16 నుంచి 23 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు, 19న మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రోజూ చెన్నై సబర్బన్ టెర్మినల్– తిరుపతి, తిరుపతి–-అరక్కోణం-–తిరుపతి, చెన్నై సెంట్రల్– తిరుపతి–చెన్సై సెంట్రల్, విల్లుపురం–తిరుపతి–-విల్లుపురం స్టేషన్ల మధ్య నడిచే ఈ రైళ్లను తిరుచనూర్– -తిరుపతి, కాట్పాడి-– తిరుపతి స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు. అలాగే  రామేశ్వరం– -ఓకా మధ్య నడిచే ఎక్స్​ప్రెస్​ రైలును కాట్పాడి, పాకాలా, ధర్మవరం, గుత్తి  స్టేషన్ల మీదుగా మళ్లించారు. హజరత్ నిజాముద్దీన్​- – తిరువనంతపురం ఎక్స్​ప్రెస్​ కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా,  మంగుళూరు సెంట్రల్– సంత్రగచ్చి, ఎస్ఎంవీటీ బెంగుళూరు-– టాటానగర్​ఎక్స్​ప్రెస్​, ఎస్​ఎంవీటీ బెంగుళూరు-– హతియా ఎక్స్​ప్రెస్,  హజరత్​నిజాముద్దీన్– ఎర్నాకులం  మార్గంలో నడిచే ఎక్స్​ప్రెస్​లను కాట్పాడి, అరక్కోణం, రేణిగుంట మీదుగా దారి మళ్లించి నడుపుతున్నారు. దారి మళ్లింపు ఈనెల16 నుంచి23 వరకు కొనసాగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.