
సికింద్రాబాద్, వెలుగు: సెంట్రల్ రైల్వేస్ పరిధిలోని సాంగ్లీ - మీరజ్ స్టేషన్ల మధ్య జరుగుతున్న ట్రాక్ డబ్లింగ్, ఇంటర్లాకింగ్ పనుల నేపథ్యంలో ఈ నెల 26నుంచి జనవరి 6 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయినవాటిలో మీరజ్-పార్లీ -మీరజ్, కొల్లాపూర్-నాగ్పూర్-కొల్లాపూర్, కొల్లాపూర్-ధన్బాద్-కొల్లాపూర్స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి.అలాగే.. తిరుపతి-కొల్లాపూర్-తిరుపతి మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను వచ్చే నెల 5 దాకా బెలగావి వరకు మాత్రమే నడపనున్నారు. నాగ్పూర్-కొల్లాపూర్మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలును కుర్డువాడి వరకు నడుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులను ప్యాసింజర్లు గమనించాలని సూచించారు.