మారడోనా వాచ్ ను కొట్టేసింది సెక్యూరిటీ గార్డే

మారడోనా వాచ్ ను కొట్టేసింది సెక్యూరిటీ గార్డే

అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం డీగో మారడోనాకు చెందిన ఖరీదైన వాచ్ కొంతకాలం కిందట మాయమైంది. ఇప్పుడా గడియారం అస్సాంలో దొరికింది. మారడోనా గతేడాది గుండెపోటుకు గురైచనిపోయాడు. ఆయనకు చెందిన పలు ఖరీదైన వస్తువులు దుబాయ్ లోని ఓ లాకర్ లో భద్రపరిచారు. అయితే అందులోని హుబ్లోట్ కంపెనీ బ్రాండెడ్ వాచ్ అదృశ్యమైంది. దీని ఖరీదు రూ.20 లక్షలు. 

మారడోనా మరణానంతరం ఆయనకు చెందిన వస్తువులు కొన్నింటిని దుబాయ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ వేలంపాటలో చేజిక్కించుకుంది. ఆ కంపెనీకి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న వాజీద్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి.. ఆ వాచీని దొంగిలించాడు.   ఆ తర్వాత తన తండ్రికి బాగోలేదని ఆగష్టులో భారత్‌ వచ్చేశాడు. ఈ చోరీని సీరియస్‌గా తీసుకున్న దుబాయ్‌ పోలీసులు.. ఎట్టకేలకు అస్సాం పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు.