Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు

Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు

నటి సన్నీ లియోన్(Sunny Leon) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పోర్న్ ఇండస్ట్రీ నుండి వచ్చి ప్రస్తుతం నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఆమె. అయితే.. ఆమె ప్రొఫెషనల్ జీవితం ఎలా ఉన్నప్పటికి పర్సనల్ జీవితంలో ఆమె చేసే మంచి పనులకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా కర్ణాటకకు చెందిన సన్నీ లియోన్ అభిమానులు ఆమె పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 

సన్నీ లియోన్ మే 13న తన 43వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా కర్ణాటకకు చెందిన ఆమె అభిమానులు కేక్ కట్టింగ్ చేశారు. భారీ కటౌట్ ను ఏర్పాటు చేసి తమ అభిమాన నటిపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు తాము సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు నిర్వహించడానికి గల కారణాలను వివరించారు.

సన్నీ లియోన్ మనసు చాలా మంచిదని, ఆమె చేస్తున్న సామాజిక సేవలే తమను అభిమానులుగా మార్చిందని వారు తెలిపారు. కరోనా 
కష్ట కాలంలో కూడా ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసిందని, వేలాది మంది ఆకలి తీర్చిందని వారు గర్తుచేశారు. ఆమె గతంలో ఎలాంటి సినిమాలు చేసినా సరే కానీ, ఆమెలో సేవా గుణం ఉందని తెలిపారు. అంతేకాదు.. భారతదేశంపై ఉన్న గౌరవంతో ఇక్కడే ఉంటుందని, అందుకు తగ్గట్లు తన జీవితాన్ని మార్చుకుందని, ఆమెకు అభిమానులుగా మారడానికి ఇంతకంటే ఇంకేం కావాలని.. వారు చెప్తున్నారు.