మహారాష్ట్రలో మళ్లీ రిజర్వేషన్ల రగడ.. మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

మహారాష్ట్రలో మళ్లీ  రిజర్వేషన్ల రగడ.. మూడు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

మహారాష్ట్రలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మరాఠా రిజర్వేషన్ల కోసం మనోజ్ జారంగే ఆధ్వర్యంలో  జరుగుతున్న  ఆందోళనలు  హింసాత్మకంగా మారాయి. 

జల్నాలోని ఓ ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టారు ఆందోళనకారులు.  దీంతో శాంతిభద్రతల అదుపు చేసేందుకు  ముందు జాగ్రత్తగా ఫిబ్రవరి 26 న మహారాష్ట్రలోని జల్నా, ఛత్రపతి సంభాజీనగర్, బీడ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.  ఈ మూడు జిల్లాల్లో సరిహద్దులు కూడా మూసివేస్తున్నట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అమల్లో ఉంటుందన్నారు.   సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో  పుకార్లు వ్యాపించడంతో  అధికారులు ఇంటర్నెట్ ను బంద్ చేశారు.  

ఫిబ్రవరి 20న మరాటా రిజర్వేషన్ బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం ప్రకారం 60 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. అసెంబ్లీలో  బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత కూడా మరాట కోటా ఉద్యమ కారుడు మనోజ్ జరంగే దీక్ష విరమించలేదు. రెండు రోజుల్లో ఆర్డినెన్స్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ  డిమాండ్ చేశారు.  దీంతో ఫిబ్రవరి 24న రాష్ట్రంలో మరో ఉద్యమం ప్రారంభించింది.