
మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారిన మరాఠా కోటా ఆందోళన తీవ్రరూపం దాల్చించి. ఈ క్రమంలో పరిస్థితిపై చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ ఉదయం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కోటా కార్యకర్త మనోజ్ జరంగే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 8వ రోజుకు చేరుకోగా, గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఐదు మరాఠ్వాడా జిల్లాల్లో ప్రభుత్వ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. నిరసనకారులు రాజకీయ నాయకుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న బీడ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు, ఇంటర్నెట్ సేవలను నిలిపి వేశారు. ఈ క్రమంలో హింసకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు కూడా పరిస్థితిని మరింత దిగజార్చేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని కోరారు.
మరోవైపు, మరాఠ్వాడా ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనల సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పలు నివేదికల ప్రకారం, రాష్ట్రంలో ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు 99 మందిని అదుపులోకి తీసుకున్నారు.