
మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మరాఠా సామాజిక వర్గానికి విద్య , ప్రభుత్వ ఉద్యోగాలు రెండింటిలోనూ 10 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా మరాఠా రిజర్వేషన్ బిల్లును ఏక్‌నాథ్ షిండే సర్కారు రూపోందించింది. ఫిబ్రవరి 20వ తేదీ మంగళవారం రోజు ఉదయం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. వెంటనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్ ఆమోదం పడిన ఆ బిల్లుకు అసెంబ్లీ కూడా ఆమోదముద్ర వేసింది.
ఈ బిల్లు చట్టంగా మారగానే మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గ ప్రజలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాక 10సంవత్సరాల వరకు సమీక్ష చేయకూడదని నిర్ణయించారు. కాగా మరాఠా రిజర్వేషన్ బిల్లును మహా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గత దశాబ్ధ కాలంలో ఇది మూడోసారి.
గతంలో రెండు సార్లు బిల్లు అసెంబ్లీ ముందుకు వెళ్లినా సభ ఆమోదం లభించలేదు. దాదాపు 2.5 కోట్ల కుటుంబాలపై జరిపిన సర్వే ఆధారంగా మహారాష్ట్ర స్టేట్ బ్యాక్‌వర్డ్ క్లాస్ కమిషన్ సమర్పించిన సమగ్ర నివేదికను అనుసరించి మరాఠా రిజర్వేషన్ బిల్లును ఏక్‌నాథ్ షిండే సర్కారు రూపోందించింది. మహారాష్ట్రలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో 94 శాతం మరాఠా కుటుంబాలేనని సర్వే సూచిస్తుంది.