ఇన్వెస్టర్లను ముంచిన యుద్ధ భయం: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

ఇన్వెస్టర్లను ముంచిన యుద్ధ భయం: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం వస్తుందనే భయాలతో దలాల్ స్ట్రీట్ రక్తశిత్తంగా మారింది. గురువారం రోజున బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్ క్లోజింగ్ నాటికి 1237 పాయింట్ల నష్టంలో స్థిరపడింది. ఇంట్రాడేలో 1450 పాయింట్లకు పైగా పడిపోయిన సూచీ చివరి నిమిషం కొంత తేరుకుని 1 శాతానికి పైగా నష్టాల్లోనే క్లోజ్ అయ్యింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ కూడా 365 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 811 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 955 పాయింట్లు పడిపోయాయి. 

మార్కెట్ల ముగింపు సమయం నాటికి ఇవాళ ఒక్కరోజునే బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దీంతో పెట్టుబడిదారులను ఇరాన్ అమెరికా వార్ ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన వార్తా సంస్థలు అమెరికా మిలిటరీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని.. ఈవారమే దాడులు జరిగే అవకాశం ఉందనే వార్తల నిద్రపోతున్న బేర్స్‌ని తట్టి లేపాయి మార్కెట్లో. 

వాస్తవ పరిస్థితులను చూస్తుంటే అమెరికా తన యుద్ధ విమానాలు, ఫ్యూయలింగ్ ఫైటర్ జెట్స్, నౌకలను ఇరాన్ చుట్టుపక్కలకు వేగంగా తరలించటం చూస్తుంటే యుద్ధం పక్కా వచ్చేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకపక్క ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ వార్ అరేంజ్మెంట్స్ మాత్రం స్పీడుగా జరిగిపోతున్నాయి. ఇరాన్ సైతం తమ సైనికులతో వార్ డ్రిల్స్ చేయించటం చూస్తుంటే ఇన్వెస్టర్ల భయాలు నిజమే అనిపిస్తోంది.