ఆషాఢమాసం వారాహి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. జులై 23 వ తేదితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్ర పరంగా పెళ్లికి ఆటంకాలు ఏర్పడుతుంటే ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే దోషాలు తొలగి.. వెంటనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివాహంలో ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి, త్వరగా మంచి జీవిత భాగస్వామి లభించాలంటే వారాహి నవరాత్రి ఉత్సవాల చివరి రోజు ( జులై 23) కాత్యాయనీ దేవి పూజ నుంచి శివపార్వతి ఆరాధన వరకు చేసి.. కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి.
వారాహి నవరాత్రి ఉత్సవాలను గుప్త నవరాత్రి ఉత్సవాలు అంటారు.. ఆషాఢమాసంలో జరిగే ఈ ఉత్సవాల్లో దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధన విశేష ఫలితాలను కలుగజేస్తుంది. ఈ పవిత్రమైన రోజుల్లో చేసే కొన్ని ప్రత్యేక పరిహారాలు జీవితంలోని అనేక సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నవారు, పదేపదే సంబంధాలు కుదరక ఇబ్బందులు పడుతున్నవారు.. వివాహానికి అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు గుప్త నవరాత్రుల సమయంలో కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కాత్యాయనీ దేవికి ఆవునెయ్యితో దీపారాధన : వారాహి నవరాత్రి ఉత్సవాల సమయంలో రోజూ సాయంత్రం కాత్యాయనీ దేవి ముందు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించాలి. తరువాత ..కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి…అనే మంత్రాన్ని కనీసం ఒక్కసారి భక్తితో జపించండి. ఇలా చేయడం వల్ల వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగి, త్వరగా మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ప్రస్తుత జీవన విధానం.. బిజీ లైఫ్ లో రోజూ చేయడం చాలామందికి అవకాశం ఉండదు. అలాంటి వారు కనీసం చివరి రోజు ( జులై 23) వ తేది ఉపవాసం ఉండి.. అమ్మవారి దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి 108 సార్లు పై మంత్రాన్ని భక్తితో జపం చేసి.. బ్రాహ్మణులకు దక్షిణ.. తాంబూలం ఇవ్వాలని పండితులు చెబుతున్నారు.
శివపార్వతులకు పసుపు సమర్పణ : వారాహి నవరాత్రి ఉత్సవాల సమయంలో శివపార్వతులకు పసుపుకొమ్ములు సమర్పించాలి. బ్రాహ్మణ దంపతులను శివపార్వతులుగా భావించి.. పసుపుకొమ్ములను దానం ఇవ్వాలి. . పసుపు శుభానికి, మంగళానికి ప్రతీక. ఈ పరిహారం వల్ల కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే శివాలయంలో జలంతో అభిషేకం చేయాలి.
సౌభాగ్య వస్తువులు దానం : వివాహం ఆలస్యమవుతున్నవారు దుర్గా సప్తశతిలోని అర్గల స్తోత్రాన్ని భక్తితో పఠించడం మంచిదని చెబుతారు. వివాహిత మహిళలకు .. లేదా దేవాలయంలో కుంకుమ, గాజులు, గోరింటాకు, ఎర్ర చీర లేదా ఎర్ర కండువా వంటి సౌభాగ్య వస్తువులను దానం చేయడంతో అమ్మవారి అనుగ్రహం కలిగి త్వరగా పెళ్లి నిశ్చయమవుతుంది.
శివపార్వతులను యజ్ఞోపవీతంతో కలపడం: వారాహి నవరాత్రి ఉత్పవాల చివరి రోజున( జులై 23) శివపార్వతుల విగ్రహాలు.. లేదా చిత్రపటం చుట్టూ యఙ్ఞోపవీతాన్ని ఏడుసార్లు చుట్టాలి. ఆ తరువాత షోడసోపచార పూజలు చేయాలి. అనంతరం అమ్మవారిని ఎంతో భక్తితో ప్రార్థిస్తే వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
