మారుతి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా.. స్టార్టింగ్ రేట్ రూ.10.99 లక్షలు

మారుతి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా.. స్టార్టింగ్ రేట్ రూ.10.99 లక్షలు

మారుతీ సుజుకీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఈ–విటారాను రూ.10.99 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధరలో బ్యాటరీ ఖర్చు ఉండదు. కస్టమర్లు బ్యాటరీని అద్దెకు తీసుకుని కిలోమీటరుకు రూ.3.99 చెల్లించాలి. డెల్టా మోడల్​లో 49 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది.

బ్యాటరీపై ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తారు. కారుపై మూడేళ్ల వారంటీ ఉంటుంది. 49 కిలోవాట్​బ్యాటరీ 440 కిలోమీటర్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ 543 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. ఫాస్ట్ చార్జర్ ద్వారా 45 నిమిషాల్లో 80 శాతం చార్జ్​ అవుతుంది.  రూ.21 వేలు చెల్లించి కారునుబుక్​ చేసుకోవచ్చు.