మాస్ మొగుడు సాంగ్ వచ్చేస్తుంది

మాస్ మొగుడు సాంగ్ వచ్చేస్తుంది

సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా వస్తున్న బాలకృష్ణ ఇప్పటికే ఆయన లుక్స్, టీజర్‌‌‌‌‌‌‌‌లోని డైలాగులతో క్యూరియాసిటీ పెంచారు. అలాగే ‘జై బాలయ్య’, ‘సుగుణాల సుందరి’, ‘మా బావ మనోభావాల్​’ అంటూ మూడు పాటలు వచ్చాయి. తాజాగా నాలుగో పాటకు ముహూర్తం పెట్టారు దర్శక నిర్మాతలు. ‘మాస్ మొగుడు’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం సాయంత్రం రిలీజ్ చేయనున్నట్టు కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో ప్రకటించారు. ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో బాలకృష్ణ, శ్రుతిహాసన్ స్టైలిష్ గెటప్స్‌‌‌‌లో ఉన్నారు.

బాలయ్య ట్రెడిషనల్ వేర్‌‌‌‌‌‌‌‌లో రాయల్‌‌‌‌గా కనిపిస్తుంటే,   శ్రుతి హాసన్ ట్రెండీ డ్రెస్‌‌‌‌లో గ్లామర్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తోంది.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌‌‌‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీమేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యేర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా  ఉంటే ఈ నెల 6న ఒంగోలులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌కు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ ఈవెంట్‌‌‌‌లోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేయనున్నారు