Health Tip : మసాజ్కు ఫుల్ డిమాండ్

Health Tip : మసాజ్కు ఫుల్ డిమాండ్

ప్రస్తుతం చాలామందిలో కనిపించే సమస్య స్ట్రెస్. దానివల్ల యాంగ్జెటీ, డిప్రెషన్, నరాల బలహీనత లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ఇక కరోనా వల్ల దాదాపు రెండేండ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు చాలామంది. దాంతో కూడా స్ట్రెస్ పెరిగిపోతోంది. ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం, నిద్రలేకపోవడం వల్ల కండరాలు బలహీనత, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి. 

ఆ ఇబ్బందుల నుంచి బయట పడేందుకు మసాజ్ చేయించుకుంటున్నారట. మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి కండరాల నొప్పులు తగ్గుతున్నాయి. అందుకే, ఈ ఏడాది మసాజ్ ప్రొడక్ట్ లకు డిమాండ్ పెరిగింది.

ఎలక్ట్రానిక్ మసాజ్ మెషిన్ల అమ్మాకాలు 8.37శాతం పెరిగాయని రీసెర్చ్ అండ్ మార్కెట్ చేసిన సర్వే ద్వారా తెలిసింది. 2021 - 2026 వరకు వాటి డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని ఆ సర్వే చెప్పింది. రాబోయే రోజుల్లో డిజిటల్ పల్స్ మసాజర్లు. మసాజింగ్ చెయిర్స్, హెయిర్ డ్రయ్యర్స్, హ్యాండ్ అండ్ ఫుట్ మసాజర్లకు డిమాండ్ పెరుగుతుందట.