రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. పట్టపగలే చీకట్లు.. వెనువెంటనే భారీ వర్షం..వీడియో వైరల్

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. పట్టపగలే చీకట్లు.. వెనువెంటనే భారీ వర్షం..వీడియో వైరల్

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. శనివారం సాయంత్రం బికనీర్ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేసింది. దట్టమైన ఇసుక మేఘాలు ఆప్రాంతం మొత్తం కమ్మేశాయి. పట్టపగలే దాదాపు చీకటిగా మారింది. ఓ పెద్ద గోడ నడిచి వస్తున్నట్లుగా ఇసుక ఆకాశాన్ని కమ్మేసి దూసుకు వస్తున్న మేఘాలకు సంబంధించిన దృశ్యాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇసుక తుఫాన్ కారణంగా రోడ్లు, వీధులు, హైవేలపై మొత్తం చీకటి కమ్మేసింది.  బికనీర్ నగరం మొత్తం ఇసుక పొగతో నిండిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. స్థానికులు ఇళ్లు నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇసుక దుమ్ముతో కూడిన గాలులు తీవ్రమవడంతో ఆ ప్రాంతంలో స్థానికులు భయంతో వణికిపోయారు. 

ఇసుక తుఫాన్ , తీవ్రమైన గాలులతో నగరంలో సాధారణ జన జీవనం ఒక్కసారిగా స్థంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కు నిలిచిపోయింది. షాపులు మూసివేశారు దుకాణదారులు. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి.  

►ALSO READ | గూగుల్‎కు 31 వేల డాలర్ల ఫైన్ వేసిన ఢిల్లీ హైకోర్టు: గూగుల్ కీవర్డ్ యాడ్స్‌పై తీర్పు

మరోవైపు శనివారం రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి ధోల్పూర్ జిల్లాలో అత్యధికంగా 58 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. బికనీర్, జైపూర్, అజ్మీర్, భరత్ పూర్ , కోటా, జోథ్ పూర్, ఉదయ్ పూర్ డివిజన్లలో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.కొన్ని ప్రాంతాల్లో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు మధ్యాహ్నం పూట ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.