సోమాలియాలో భారీ పేలుడు..30 మంది మృతి

సోమాలియాలో భారీ పేలుడు..30 మంది మృతి

ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ పేలుడు జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది వ్యక్తులు చనిపోగా… మరో 60 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రత భారీగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పన్ను వసూలు కేంద్రం లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలర్ట్ గా ఉండాలని స్థానికులకు ఆదేశాలు జారీ చేశారు.