పాతబస్తీలో అగ్ని ప్రమాదం

పాతబస్తీలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2023, మార్చి 11వ తేదీన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్సారీ రోడ్డు తాడ్‌బడ్లోని కూలర్ల తయారీ గోడౌన్ లో ఈ ప్రమాదం జరిగింది. గోడౌన్ యజమాని సంఘటనా స్థలానికి చేరుకొని ఏరియా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.