
హైదరాబాద్ లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయ్యప్ప సొసైటీలో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం ( సెప్టెంబర్ 13 ) తెల్లవారుజామున 4 : 30 గంటల సమయంలో జరిగింది ఈ అగ్ని ప్రమాదం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మంటలు చెలరేగాయి.
ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ.. భారీగా ఆస్థి నష్టం సంభవించింది. ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమయానికి ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్థి నష్టం ఎంత జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది.