బిర్యానీ రెస్టారెంట్‎లో మంటలు: 20 మంది కస్టమర్లు సజీవ దహనం

బిర్యానీ రెస్టారెంట్‎లో మంటలు: 20 మంది కస్టమర్లు సజీవ దహనం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం (జూన్ 3) తెల్లవారుజూమున మాల్వీయా నగర్ ప్రాంతంలో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. 

10 ఫైరింజన్లతో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్టారెంట్ బేస్‏మెంట్‎లో చిక్కుకున్న 11 మందిని రక్షించి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

అధికారుల వివరాల ప్రకారం.. బుధవారం (జూన్ 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో దక్షిణ ఢిల్లీలోని మాల్వీయా నగర్‎లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే వెంటనే పది ఫైరింజన్లను ఘటనా స్థలానికి పంపించామని చెప్పారు. రెస్టారెంట్ బేస్మెంట్‎లో ఉన్న 11 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.