హైద్రాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్ బి కాలనిలో ఉన్న ప్లై వుడ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున మంటలు ఎగసిపడ్డాయి. మంటల ధాటికి ఫ్లై వుడ్ కంపెనీ పూర్తిగా దగ్గమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లోతో మంటలార్పారు ఫైర్ అధికారులు.
ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అధికారులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరాదీస్తున్నారు.
