మన్నెగూడ స్క్రాబ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

మన్నెగూడ స్క్రాబ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నేగూడ దగ్గరలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంట పొలాల మధ్యలో ఉన్న స్క్రాబ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో   ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది దాదాపు 3 గంటలు ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్క్రాబ్ గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన మెడీ వేస్టేజ్ ఉన్నట్టు గుర్తించారు ఫైర్ సిబ్బంది. 

సిరంజీ నీడిల్స్, కెమికల్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న గులాబీ తోట పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదంతో మన్నేగూడ పరిసర ప్రాంతాలన్ని పొగతో అలముకున్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గోదాం నిర్వాహకులు పరారీలో ఉన్నారని చెప్పారు.