V6 News

హమారా హైదరాబాద్: డేటా సెంటర్ల హబ్‎గా తెలంగాణ.. వచ్చిన పెట్టుబడులు.. రాబోయే ఉద్యోగాలు ఇవే

హమారా హైదరాబాద్: డేటా సెంటర్ల హబ్‎గా తెలంగాణ.. వచ్చిన పెట్టుబడులు.. రాబోయే ఉద్యోగాలు ఇవే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్​వేదికగా రాష్ట్ర చరిత్రలోనే భారీగా పెట్టుబడులు వచ్చాయి. రెండు రోజుల సమిట్‎లో ఏకంగా రూ. 5 లక్షల 75 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలిరోజు సోమవారం రూ. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులు రాగా.. రెండో రోజు అది మరింత పెరిగింది. 

మంగళవారం ఒక్కరోజే రూ. 3 లక్షల 32 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇంధన, ఐటీ, పర్యాటక, ఫార్మా రంగాల దిగ్గజాలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు వచ్చిన పెట్టుబడుల్లో విద్యుత్​రంగం సింహభాగంలో నిలువగా.. డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వచ్చాయి.

డేటా సెంటర్ల హబ్‌‌‌‌గా తెలంగాణ: డిజిటల్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రాష్ట్రానికి భారీ ఎత్తున నిధులు వచ్చాయి.

  • ఇన్‌‌‌‌ఫ్రాకీ డిసి పార్క్స్: 150 ఎకరాల్లో 1 గిగావాట్ డేటా పార్క్ కోసం రూ. 70,000 కోట్ల సంచలనాత్మక పెట్టుబడి
  • జెసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: డేటా సెంటర్ల కోసం రూ. 9,000 కోట్లు (2 వేల ఉద్యోగాలు)
  • ఏజీపీ గ్రూప్: 1 గిగావాట్ డేటా సెంటర్ కోసం రూ. 6,750 కోట్లు
  • ఆక్వెలాన్ నెక్సస్: 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్
  • పర్వ్యూ గ్రూప్: 50 మెగావాట్ల ఏఐ ఆధారిత డేటా సెంటర్ (3 వేల ఉద్యోగాలు)
  • బ్లాక్‌‌‌‌స్టోన్: ఆసియా డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ పార్కుల్లో పెట్టుబడులకు ఆసక్తి