ఇవాళ ( జూన్ 8 ) భూమిని తాకనున్న సౌర తుఫాన్... నార్త్ ఇండియా, యూరప్, ఆస్ట్రేలియాలో రంగురంగుల కాంతులతో కనిపించనున్న అరోరాలు

ఇవాళ ( జూన్ 8 ) భూమిని తాకనున్న సౌర తుఫాన్... నార్త్ ఇండియా, యూరప్, ఆస్ట్రేలియాలో రంగురంగుల కాంతులతో కనిపించనున్న అరోరాలు
  • సెకనుకు 1,400 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది: నాసా
  • మనుషులకు, ప్రాణులకు ఎలాంటి ముప్పు ఉండదని వెల్లడి

వాషింగ్టన్: సూర్యుడిపై ఇటీవల సంభవించిన ఒక భారీ విస్ఫోటనంతో ఏర్పడిన సౌర తుఫాన్ సోమవారం భూమిని తాకనుంది. ఈ పేలుడు ధాటికి అంతరిక్షంలోకి ఎగిసిపడిన సూర్యుడి ప్లాస్మాతోకూడిన సౌర తుఫాన్ సెకనుకు 1,400 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. 

ఈ సౌర తుఫాన్ సోమవారం భూవాతావరణాన్ని తాకుతుందని, దీంతో జీ3 కేటగిరీ జియోమ్యాగ్నెటిక్ స్టార్మ్ ఏర్పడి.. దాని ప్రభావంతో నార్త్ ఇండియా, యూరప్, ఆస్ట్రేలియా గగనతలాల్లో రంగురంగుల కాంతులతో కూడిన అరోరాలు కనిపిస్తాయని తెలిపింది. 

సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ తాకడంతో భూఅయస్కాంత క్షేత్రం కొద్ది సేపు ప్రభావితం కావడం వల్లే అరోరాలు ఏర్పడతాయని,  దీనితో భూమిపై ప్రాణులకు ఎలాంటి ముప్పు లేదని నాసా స్పష్టం చేసింది.