
సికింద్రాబాద్… ఓల్డ్ బోయిన్ పల్లిలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. మూడు కిలోల బంగారం, 18 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. ఓల్డ్ బోయిన్ పల్లి లోని మల్లికార్జున నగర్ లో ఈ ఘటన జరిగింది. బాధితురాలు సరళ …వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో ఇంట్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు, డబ్బు నిల్వ ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో సొత్తు పోయినట్లు గుర్తించిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేట ఏసీపీ రామ్ రెడ్డి, క్లూస్ టీమ్ వచ్చి ఇంట్లో జరిగిన దొంగతనం వివరాలు, ఆధారాలు సేకరించారు.