పే..ద్ద ట్రాన్స్​ఫార్మర్..పుణే టు తమిళనాడుకు జర్నీ.. పరిగి పట్టణం దాటేందుకు 2 రోజుల టైం

పే..ద్ద ట్రాన్స్​ఫార్మర్..పుణే టు తమిళనాడుకు జర్నీ.. పరిగి పట్టణం దాటేందుకు 2 రోజుల టైం
 

పరిగి, వెలుగు: వికారాబాద్​ జిల్లా పరిగిలో అతిపెద్ద భారీ ట్రక్కును చూసి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. చూడాడనికి ఏడు అంతస్తుల బిల్డింగ్ మాదిరి కనిపిస్తున్న అతిపెద్ద ట్రాన్స్​ఫార్మర్​ను తీసుకొని, ఈ వాహనం 30 రోజుల క్రితం పుణే నుంచి తమిళనాడులోని కాంచిపురం బయలుదేరింది. జాతీయ రహదారి 163పై ఈ వాహనానికి అడుగడుగునా అడ్డంకులు ఏర్పడడంతో ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తోంది. ఆదివారం రాత్రి పరిగికి చేరుకున్న ఈ ట్రక్కు.. పట్టణం దాటేందుకు రెండు రోజులు టైం పడుతుందని డ్రైవర్ తెలిపాడు.

ముఖ్యంగా విద్యుత్  అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అవసరమైన చోట కరెంట్​ను నియంత్రించి, సూచిక బోర్డులు తొలగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. టోల్ గేట్లు ఉన్న హైవేలో వెళ్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని సాధ్యమైనంతవరకు టోల్​గేట్ లేని మార్గాన వెళ్లేందుకు మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. ట్రక్కును నడిపేందుకు మొత్తం 15 మంది పనిచేస్తుంగా, రోజుకు 20 నుంచి 30 కి.మీ. వెళ్తున్నామని వివరించాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ అతిపెద్ద ట్రాన్స్​ఫార్మర్ మరో  ట్రాన్స్ ఫార్మర్​పనితీరును పరిశీలిస్తుందని తెలిపారు.