ఫోర్జరీ సంతకాలతో భారీగా అప్లికేషన్లు

ఫోర్జరీ సంతకాలతో భారీగా అప్లికేషన్లు

మేళ్లచెరువు, వెలుగు: ‘మేము ఊళ్లో ఉండట్లేదు.. మా ఓట్లు తొలగించాలంటూ’ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు తహసీల్దార్​కు ఫోర్జరీ సంతకాలతో భారీగా ఫేక్​ అప్లికేషన్లు అందాయి. ఒకే ఊరి నుంచి అన్ని అప్లికేషన్లు రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు గ్రామానికి వెళ్లి విచారించగా అవన్నీ ఫేక్ ​అని తేలింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మేళ్లచెరువు మండలంలోని రామాపురం నుంచి 350 మంది గ్రామస్తులు తాము ఊరిలో ఉండట్లేదని.. తమ ఓట్లు తొలగించాలంటూ పెట్టుకున్న ఫాం7 అప్లికేషన్లు తహసీల్దార్​ఆఫీసుకు చేరాయి.  ఒకేసారి అన్ని రావడంతో రెవెన్యూ ఆఫీసర్లు గ్రామంలో విచారణ చేపట్టగా అవన్నీ ఫేక్ ​అప్లికేషన్లని తెలిసింది. గుర్తుతెలియని వ్యక్తులు గ్రామస్తుల సంతకాలను ఫోర్జరీ చేసి ఇలా అప్లై చేశారని తేలింది. దీంతో 20 మంది బాధితులు శుక్రవారం తహసీల్దార్​దామోదర్​రావును కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.