నరేందర్.. సరెండర్..ట్రేడ్ డీల్పై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన

నరేందర్.. సరెండర్..ట్రేడ్ డీల్పై పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన

న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్​డీల్​కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ ఒప్పందంతో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలు అమెరికాకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. 

ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ‘ట్రాప్ డీల్’, ‘నరేందర్.. సరెండర్’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ సీనియర్​నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కార్మికులు, రైతుల భవిష్యత్తు ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 

ప్రధాని మోదీపై ఇతరులు బలమైన పట్టు సాధించినట్టు కన్పిస్తున్నదన్నారు. దేశ ఇంధన భద్రతను అమెరికా చేతుల్లో పెట్టేశారని ఆరోపించారు. ప్రజల డేటా, ఆహార సరఫరా వ్యవస్థ, ఇంధన రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని రాహుల్​ పేర్కొన్నారు.