Masthu Shades Unnai Ra Review: మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా మూవీ రిజల్ట్ ఏంటి?

Masthu Shades Unnai Ra Review: మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా మూవీ రిజల్ట్ ఏంటి?

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమతం(Abhinav Gomatham) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా(Masthu Shades Unnai Ra). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు తిరుపతి రావు ఇండ్ల తెరకెక్కించగా.. ఆరేం రెడ్డి, ప్రశాంత్ వి, భవాని కాసుల సంయుక్తంగా నిర్మించారు. వైశాలి, రాజ్ మోయిన్ కీ రోల్స్ చేసిన ఈ సినిమా నేడు (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సినిమా గురించి ఆడియన్స్ ఏమంటున్నారు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా.. ఇది మనోహర్ ( అభినవ్‌ గోమఠం) కథ. అతను ఒక పెయింటర్. అతని క్లోజ్ ఫ్రెండ్ శివ. మనోహర్ లైఫ్ లో సెటిల్ అవలేదని పెళ్లిపీటలపై నుండి పెళ్లికూతురు లేచిపోతుంది. ఆ కోపంతో ఫ్లెక్స్ డిజైనింగ్ షాప్ పెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు మనోహర్.ఆ ప్రయాణంలోనే అతనికి ఉమాదేవి ( వైశాలి రాజ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ఎం జరిగింది? మనోహర్ ఎలా విజయం సాధించాడు? అతనికి రాహుల్ (అలీ రెజా) మధ్య లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:

ఒక సినిమా జనాలకు నచ్చేలా తీయాలంటే ఒక చిన్న పాయింట్, దానికి తగ్గ ఎమోషన్స్, బెస్ట్ టెక్నీకల్ టీమ్ ఇవుంటే చాలు. అలా వచ్చిన సినిమానే మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా. ఒక రెండు గంటలపాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతోనే స్టార్ అయింది. కానీ, అది తెరమీదకి వచ్చేసరికి మారిపోయిది.

కథ పరంగా చూసుకుంటే మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా బాగుంది. కానీ, ప్రెజెంటేషన్ మిస్ అయిందనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ సో సోగానే మొదలవుతుంది. పరిచయ సన్నివేశాలు కూడా అంతే. కథలోకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది.

ఇక సెకండ్ ఆఫ్ ఆడియన్స్ కు పెద్ద రిలీఫ్. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కథలోని మెయిన్ ప్లాట్, వాటిని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. సీన్స్ మధ్యలో జనరేట్ అయ్యే ఫన్ కూడా నవ్విస్తుంది. ఇక ప్రీ క్లయిమ్యాక్స్ నుండి క్లయిమ్యాక్స్ వరకు ఇంట్రెస్టింగానే సాగుతుంది. ఫైనల్ గా మంచి ఎండింగ్.

నటీనటులు:
ఈ సినిమాలో మెయిన్ లీడ్ చేసిన అభినవ్‌ గోమఠం తనదైన డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. మనోహర్ పాత్రలో మంచి పెరఫార్మెన్స్ ఇచ్చాడు. సినిమా అంతా తన ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇక హీరోయిన్ వైశాలి రాజ్ కూడా పర్వాలేదు అనిపించారు. కథ చాలా సహజంగా ఉంటుంది కాబట్టి నటీనటులు కూడా చాలా సహజంగా కనిపించారు. మిగతా నటీనటులు కూడా పాత్ర మేరకు మెప్పించారు.

సాంకేతిక నిపుణులు:
టెక్నీకల్ డీటెయిల్స్ లో ముందు చెప్పుకోవాల్సింది సంజీవ్ థామస్ సంగీతం. పాటలు సోసో గానే ఉన్నాయి. బీజీఎమ్ పరవాలేదు. ఇక సిద్ధార్థ స్వయంభూ కెమెరా వర్క్ షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువ అనే విధంగా ఉంది. ఇక దర్శకుడు తిరుపతి రావు ఇండ్ల కథ, కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. తన బెస్ట్ ఇచ్చాడు కూడా. టెక్నీకల్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఇంకాస్త బాగా పనిచేసుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది. ఈ విషయంలో డైరెక్టర్ వందశాతం ఇచ్చాడు. మంచి ఫ్యూచర్ కూడా ఉంది. 

ఇక మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా సినిమా గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే.. బాగుంది కానీ!