
సౌతాఫ్రికా విజయానికి చివరి 5 బంతుల్లో 21 పరుగులు అవసరం. అప్పటికే సఫారీలు 7 వికెట్లు కోల్పోయి ఆశలు వదిలేసుకుంది. అయితే ఒక ఎండ్ లో ఓపెనర్ రికెల్ టన్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సఫారీ ఓపెనర్ రెండు సిక్సర్లు వేస్తే ఒత్తిడంతా ఆస్ట్రేలియాపైనే ఉంటుంది. ఈ దశలో ఆస్ట్రేలియా పేసర్ బెన్ ద్వార్షుయిస్ 20 ఓవర్ రెండో బంతిని స్లో బాల్ వేశాడు. రికెల్ టన్ లాంగాన్ దిశగా బలంగా బాదాడు. చూస్తే ప్రతి ఒక్కరు సిక్సర్ ఖాయమనుకున్నారు. ఈ దశలో ఆసీస్ కు ఆపద్బాంధవుడిలా మ్యాక్స్ వెల్ దూసుకొచ్చాడు. బౌండరీ దగ్గర స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
సిక్సర్ వెళ్తున్న బంతిని గాల్లోకి దూకి బౌండరీ లోపల అందుకొని అంతలోనే బంతిని బౌండరీ లోపలకు విసిరి క్యాచ్ అందుకోవడం విశేషం. ఇదంతా రెప్పపాటులో జరగడంతో స్టేడియంలో ప్రేక్షకులు షాక్ కు గురయ్యారు. సాధారణంగా మ్యాక్సీకి ఇలాంటి క్యాచ్ లు అందుకోవడం అలవాటే. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి క్యాచ్ లు అందుకొని మ్యాచ్ స్వారూపాన్ని మార్చేశాడు. ఫీల్డింగ్ లో అద్భుతాలు చేసిన మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ లో నిరాశపరిచాడు. 5 బంతుల్లో కేవలం ఒక పరుగే చేసి ఔటయ్యాడు. అయితే బౌలింగ్ లో మాత్రం అంచానాలకు మించి రాణించాడు నాలుగు ఓవర్ల తన స్పెల్ లో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
there is no aus cricket without glenn maxwell pic.twitter.com/bcAYHYNJ4S
— max. (@rcbxoxo) August 10, 2025
ఈ మ్యాచ్ విషయానికి తొలి టీ20 లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చచేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టిమ్ డేవిడ్ 52 బంతుల్లోనే 83 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గ్రీన్ 13 బంతుల్లోనే 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. 179 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 161 పరుగులు చేసి 17 పరుగులతో ఓడిపోయింది.