వెలుగు నెట్‌వర్క్ : వడదెబ్బ కారణంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోయారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం, సులానగర్ గ్రామానికి చెందిన సూరేపల్లి జయరామయ్య (62), జూలూరుపాడు మండలం పెద్దహరిజనవాడకు చెందిన ఇసనపల్లి కృష్ణ (30), టేకులపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన మారుతి వెంకటేశ్వర్లు (60) వడదెబ్బతో చనిపోయారు.
అలాగే వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని తొర్మామిడికి చెందిన కూలీ మొండి నరేశ్ (45), ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన అంగన్‌వాడీ టీచర్ శ్రీపాద సుశీల, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలానికి చెందిన బయ్యారం కృష్ణారెడ్డి (65), సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన పాటి తిరుపతి (60), హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ రవీందర్ (56), ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన రైతు కడారి ఎల్లయ్య (65) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు.
