దళిత మహిళను పీఎం చేద్దాం : పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

దళిత మహిళను పీఎం చేద్దాం :  పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • దళిత సీఎం ఎలాగూ కాలేదు..
  • కేసీఆర్‌ను ఉద్దేశించి పవన్‌ కల్యాణ్‌
  • తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం

‘‘తెలంగాణ సీఎం కేసీఆర్ గారూ.. ఉద్యమ నేతగా మీ మీద చాలా గౌరవం ఉంది. తెలంగాణ వస్తే దళితుణ్నిసీఎం చేస్తామని చేయలేదు. ఉద్యమ సమయంలో మిమ్మల్ని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ , ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డిలు అవమానిం చారు. తిట్టారు. కానీ ఇప్పుడు వాళ్లం తా మీ పక్కన ఉన్నారు’’ అని జనసేన అధినేత పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘‘దయచేసి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టకండి. మీకు చంద్రబాబుకు గొడవలుంటే మాట్లాడుకొని తేల్చుకోం డి. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. మీ గొడవల వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టకండి. జగన్ ను వెనుకేసుకు రాకండి. మీరు జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు తెలుపుతుంటే నా పోరాటం వృథా అవుతుంది’’ అని చెప్పారు. లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీఎస్పీ, జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేసీఆర్ మద్దతును ప్రస్తావిస్తూ.. ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు పది సీట్లు కూడా లేవు ఉద్యమం ఎలా చేస్తారని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఉద్యమం టైంలోవరంగల్ సభకు రాకుండా ఉద్యమకారులు జగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెనక్కి పంపారు. జగన్ ను పక్కన పెట్టండి. మద్దతు పలకొద్దు. సంయమనం పాటిస్తూ రాజకీయం చేయండి’’ అని అన్నారు. యాదాద్రికి జగన్ చెప్పులువేసుకొని వస్తే మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నిం చారు.

కవితలా గొప్ప కుటుంబాల నుంచి రాలేదు

కాన్షీరాం ఒక్క కేసు లేకుండా కేవలం ఓటుతోనే మార్పు తెచ్చారని, ఆయన బాటలో నడుస్తూ మాయావతి పార్టీని నడుపుతున్నారని పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, కేసీఆర్ కుమార్తె కవిత లాగ మాయావతి గొప్ప కుటుంబం నుం చి రాలేదని, ఎన్నోకష్టాలు, తిట్లు, ఇబ్బందులు పడుతూ పార్టీని నడుపుతున్నారని అన్నారు. దాడులు, గుండాలు ఉండే పెద్దరాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం అయ్యారని, జీవితాన్నిఎంతో అర్థం చేసుకున్నారన్నారు.

తెలంగాణలో జన్మించే అవకాశం ఉంటే…

ఉద్యమ సమయంలో ఓయూ, ఆర్ఈసీ స్టూడెంట్స్‌ ,యువత మార్పు కోరుకున్నారన్నారు. ఎన్ని కల్లో పోటీచేస్తే యువతకు, ఓయూ విద్యార్థులకు టికెట్లు ఇచ్చేవాడినని చెప్పారు. అసెంబ్లీకి ఓయూ, ఆర్ఈసీ విద్యార్థులు ప్రవేశించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి యువత వల్ల అవుతుందని, తలసాని లాంటి వాళ్ల వల్ల కాదన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో యువతకు చాలా మందికి టికెట్లు ఇస్తా. రాష్ట్రం విడిపోవటం కాదు..దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు రావాలి. ఏపీ పాలకులు వేరు.. ప్రజలు వేరు. పాలకులు చేసిన తప్పుకు ప్రజలను అనొద్దు. తెలంగాణ వచ్చినపుడు ఆనందపడిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఉద్యమం నా చేతుల్లో ఉంటే ఏపీ పాలకులకు చుక్కలు చూపెట్టేవాణ్ని. తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం . ఆ అవకాశం ఉంటే కరీంనగర్ లో పుట్టేవాణ్ని’’ అని అన్నారు.

ప్రతిపక్షం లేకుంటే ఎలా?

ప్రతిపక్షం లేకుండా పాలన ఎలా అని పవన్ ప్రశ్నించారు. మోడీ, చంద్రబాబు, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రతిపక్షం ఉండొద్దని భావిస్తున్నట్టు గా ఉందన్నారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజలు సమస్యలు ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. 2014లో మోడీని నమ్మానని, కానీ ప్రేమతో పాలించమంటే భయంతో పాలించారన్నారు. చాయ్‌ వాలా మోడీ పీఎం అయినపుడు, కేసీఆర్ సీఎం అయినపుడు, దళిత నేత మాయావతి పీఎం ఎందుకు కావొద్దని అన్నారు. ఆమె బలమైన వ్యక్తి అని, మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నానంటూ ఆమె కాళ్లకు నమస్కరిం చారు. సభలో పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘పల్లె కన్నీరు పెడుతుందో..’‘బండెనక బండి కట్టి.. ’ పాటలు పాడారు.

దళిత మహిళను పీఎం చేద్దాం..

ప్రత్యేక రాష్ట్రం వస్తే దళిత వ్యక్తి ని సీఎం చేస్తానని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదని పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానిం చారు.‘‘ప్రత్యేక పరిస్థితు ల వల్ల చేయ లేదేమో. వాటి గురిం చి నేను మాట్లాడను. దేశానికైనా దళిత మహిళను పీఎం చేద్దాం. ఇది రెచ్చగొట్టడానికి చెప్పటం లేదు’’ అని అన్నారు.  లక్ష ఉద్యోగాల కల్పనకు కొంత సమయం పడుతుందని, ఉద్యోగాలు రాలేదని ఓయూ విద్యార్థులకు కోపం ఉందని చెప్పారు.

నాకు రాజకీయ జ్ఞానం ప్రసాదించిన ప్రాంతం

తనకు రాజకీయ జ్ఞానాన్ని ప్రసాదించిన ప్రాంతం తెలంగాణ అని, సాయుధ పోరాటం ఎంతో స్ఫూర్తిని కలిగించిందని పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.‘‘తెలంగాణ గురించి ఏం తెలుసని నన్ను చాలామంది ప్రశ్నిం చారు. ఇక్కడి సంప్రదాయాలు,కష్టాలు, నేల, బాధలు అన్నీ తెలుసు. ప్రజల కష్టాలు, కన్నీళ్లే నన్ను జనసేన ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాయి. సమాజంలో కొంత మందికే అధికారం, పదవులు అందుతున్నాయి. అధికారంలోకి రాకున్నా పీఆర్పీలో చాలా మంది యువతకు, మేధావులకు టికెట్లు ఇచ్చాం .పీఆర్పీ సమయంలో అదిలాబాద్ వెళ్తే ఓ వృద్ధురాలు తాగునీరు ఇవ్వాలని కోరడం చూసిచలించిపోయా. యువత ముందుకు రావాలి.ఎన్ని ఓట్లు, సీట్లు గెలిచామన్నది కాదు. ఎన్నికల్లో పోరాటం చేయటం ముఖ్యం . పార్టీని నడపాలంటే వేల కోట్ల నగదు అవసరం. సభలు నిర్వహిం-చాలంటే నిధులు సమీకరించాల్సి వస్తోం ది. ఎంత కాలం పార్టీని నడుపుతావని నన్ను చాలామంది అడిగారు. నలుగురు జన సైనికులు నా శవాన్ని మోసుకెళ్లే వరకు నడుపుతానని వాళ్లకు చెప్పాను’’ అని అన్నారు.

రెండు శాతం కూడా లేనోళ్లకే పదవులు :మాయావతి 

రాష్ట్రంలో 70 శాతానికి పైగా జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగా వెనుకబడి ఉన్నారని, కేవలం ఒకటిన్నర, రెండు శాతం జనాభా ఉన్న వర్గానికి చెం దినవారు ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ఉన్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానిం చారు. వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అయినా ఏమాత్రం అభివృద్ధి చెందలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను టీఆర్ ఎస్ ప్రభుత్వం తీర్చలేదని విమర్శించారు. గురువారం హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో జనసేన,బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన బహిరంగసభలో మాయావతి మాట్లాడారు. అచ్చేదిన్ అని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కానీ అన్నిరంగాల్లో విఫలమైందని మండిపడ్డా రు. వందరోజుల్లో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలచొప్పున జమ చేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని, నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు ఎంతో ఇబ్బం దులు పడ్డారని గుర్తు చేశారు. అందుకే దేశంలో జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో పోటీ చేస్తు న్నజనసేన, బీఎస్పీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మాయావతి పిలుపునిచ్చారు.

ముందు ఇచ్చి మాట్లాడండి

కాంగ్రెస్ పార్టీ పేదలకు ఏటా రూ. 72 వేలు ఇస్తామని చెబుతోందని, అదేదో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చి మాట్లాడాలని మాయావతి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లో తాము ఎక్కువ సీట్లు సాధిస్తామని, అక్కడ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్లే అధికారంలోకి వస్తారని చెప్పారు. దేశంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలేనని, వాళ్లు అభివృద్ధి చెందడానికే అంబేద్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. బలహీన వర్గా ల వారికి ప్రాధాన్యత ఇచ్చేవారికి , చెప్పింది చేసే వారికి ఓటేయాలని పిలుపునిచ్చారు.