
యూపీ రాజకీయాల్లో బీఎస్పీ చీఫ్ మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ మరోసారి హైలైట్ అయ్యారు. బీఎస్పీ చీఫ్ నేషనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యత అప్పగించారు. ఆదివారం (మే 18) జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఆకాష్ ఆనంద్ కు కీలక బాధ్యతలు ఒప్పజెప్పింది మాయావతి. ఆకాష్ తోపాటు మరో ముగ్గురు జాతీయ సమన్వయకర్తలుగా పనిచేస్తారు. జాతీయ సమన్వయకర్తలుగా రాజ్యసభ ఎంపీలు రామ్‌జీ గౌతమ్, రణధీర్ బేనివాల్, రాజారాంలను నియమించారు. ఆకాష్ ఆనంద్ రాజకీయ బాధ్యతను పెంచే నిర్ణయం పార్టీలో కొత్త శక్తిని నింపుతుందని బీఎస్పీ నేతలు భావిస్తున్నారు.
గతంలో ఆకాస్ ఆనంద్ పై బహిష్కరణ వేటు
మూడు నెలల క్రితం ఆకాస్ ఆనంద్ ను పార్టీనుంచి బహిస్కరించింది బీఎస్పీ చీఫ్ మాయావతి. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో తన మేనల్లుడు అయిన ఆకాష్ ఆనంద్ ను, అతని మామ అశోక్ సిద్ధార్థ్ లను పార్టీనుంచి బహిష్కరించారు. అయితే ఇటీవల ఆకాష్ ఆనంద్ క్షమాపణలు చెప్పడం.. పార్టీలో బుద్దిగా పార్టీ లో పనిచేసే అవకాశం కల్పించాలని చెప్పారు. ఓ నాటకీయ మలుపు తర్వాత ఆకాష్ ఆనంద్ కు మరో అవకాశం ఇవ్వాలని BSP చీఫ్ నిర్ణయించుకుని పార్టీలోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు.