అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి  ఆదేశించారు. జోనల్, అడిషనల్ కమిషనర్ ల ఇంజనీరింగ్ అధికారుల తో మేయర్  శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...  వర్షాల నేపథ్యం లో   పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి  ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని, నాలాల వద్ద ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డు లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వర్షాలు పడుతున్నా.. ఎస్ఎన్డీపీ పనులు కొనసాగించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

మాన్సూన్ యాక్షన్ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలి

మాన్సూన్ యాక్షన్ టీమ్ లు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సందర్భంలో  అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాల నేపథ్యం లో  ట్విట్టర్, ఫోన్ కాల్స్, ప్రజా ఫిర్యాదుల స్వీకరించి అట్టి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్య ఏర్పడినప్పుడు సత్వరం పునరావాస చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, జోనల్ స్థాయిలో  హెల్ప్ లైన్ ఏర్పాటు  చేయాలని జోనల్ కమిషనర్లను  ఆదేశించారు.