అలర్ట్గా ఉండి..ప్రజల ఫిర్యాదులను పరిష్కరించండి

అలర్ట్గా ఉండి..ప్రజల ఫిర్యాదులను పరిష్కరించండి

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో వర్షాలపై జోనల్ కమిషనర్లతో మేయర్ విజయలక్ష్మీ సమీక్ష నిర్వహించారు. నగరంలో కురుస్తున్న వర్షాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితిని అధికారులను అడిగి తెల్సుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్ ఆదేశించారు. డ్రైనేజీల వద్ద చెత్త నిలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు  కరెంట్ పోల్స్, నాలాల పరిసరాల్లోకి  ప్రజలు వెళ్లకుండా చూడాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే..వెంటనే బల్దియ కంట్రోల్ రూం నెం. 040--21111111కు కాల్ చెయ్యాలని మేయర్ సూచించారు. నగరవాసుల దగ్గర నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.