
యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్ మేయర్ సాధిక్ ఖాన్ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
లండన్ వీధుల్లో ఘనంగా వార్షిక దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. యూకేలో ... భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నృత్యాలు, సంగీతం సహా పలు రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మహిళలు డ్యాన్సు చేసి, అందరినీ అలరించారు. హిందువులు, సిక్కు, జైన సంఘాలు వారివారి సంప్రదాయాల్లో నృత్యాలు చేశారు. ప్రత్యేకమైన దీపావళి వంటకాలు కూడా చేశారు.
#WATCH | London, UK: The Mayor of London, organised the annual Diwali celebration at Trafalgar Square.
— ANI (@ANI) October 29, 2023
The free public event featured Indian traditional dances, music, activities, and food from various parts of India that capture the festival's spirit. pic.twitter.com/qyBtsJXUru
ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.