ప్రైమ్ డే 2026 డీల్స్ ఇవే

ప్రైమ్ డే 2026 డీల్స్ ఇవే

హైదరాబాద్​, వెలుగు: అమెజాన్ ఇండియా ప్రైమ్ డే సేల్​ను వచ్చే నెల 4–6 తేదీల్లో నిర్వహించనుంది. పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రైమ్ సభ్యుల కోసం సుమారు 300 బ్రాండ్ల నుంచి 15 వేల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉంటాయి. స్మార్ట్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లు, గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. కొత్తగా ప్రైమ్ సభ్యత్వం తీసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తారు.

ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్​స్టంట్ ​డిస్కౌంట్​ ఉంటుంది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుపై 5శాతం క్యాష్‌‌‌‌బ్యాక్ వస్తుంది.  శామ్‌‌‌‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, వన్‌‌‌‌ప్లస్ 13 వంటి ఫోన్లతోపాటు, గృహోపకరణాలు, ఫ్యాషన్ ఉత్పత్తులపై కూడా ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయని అమెజాన్ ప్రకటించింది.